Sandalwood: బెయిలు కోసం మరోమారు కోర్టును ఆశ్రయించిన నటి సంజన
- డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంజన
- బెయిలు పిటిషన్లను ఇప్పటికే రెండుసార్లు కొట్టేసిన కోర్టు
- ఎఫ్ఐఆర్లో ఆమె పేరు లేదన్న సంజన న్యాయవాదులు
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న నటి సంజన గల్రానీ తనకు బెయిలు ఇప్పించాలంటూ మరోమారు కోర్టును ఆశ్రయించింది. ఆమె పెట్టుకున్న బెయిలు పిటిషన్లను కోర్టు ఇప్పటికే రెండుసార్లు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
సీసీబీ, నార్కోటిక్ విభాగం అధికారులు చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇప్పటికీ ఆమె పేరును ఎఫ్ఐఆర్లో ప్రస్తావించలేదని పిటిషన్లో పేర్కొన్న సంజన తరపు న్యాయవాదులు సీసీబీ, కాటన్‌పేట పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. కాగా, ఈ కేసులో సంజనతోపాటు పాటు రాగిణి ద్వివేదీని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు పరప్పన అగ్రహారలోని కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈ నెల 23 వరకు వీరి కస్టడీని కోర్టు పొడిగించింది.