tonsure: బెయిలుపై విడుదలైన కాసేపటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియ మళ్లీ అరెస్ట్

Nutan Naidu wife Madhupriya arrested once again
  • శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన మధుప్రియ
  • చీటింగ్ కేసులో మరోమారు అరెస్ట్
  • ఈ నెల 20 వరకు రిమాండ్
దళిత యువకుడి శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన సినీ నటుడు, నిర్మాత నూతన్ నాయుడు భార్య మధుప్రియను పోలీసులు మరోమారు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో తమ నుంచి రూ. 25 లక్షలు వసూలు చేశారంటూ తూర్పుగోదావరికి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధుప్రియ బెయిలు నుంచి విడుదలైన కాసేపటికే మళ్లీ ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది.

తన ఇంట్లో పనిచేసి మానేసిన దళిత యువకుడు శ్రీకాంత్‌కు ఆగస్టు 28న ఇంట్లోనే శిరోముండనం చేయించిన ఘటన అప్పట్లో పెను సంచలనమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులో తొలుత మధుప్రియతోపాటు మరికొందరిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న నూతన్ నాయుడును ఆ తర్వాత అరెస్ట్ చేశారు. తాజాగా, మధుప్రియ బెయిలుపై బయటకు రాగా, కాసేపటికే చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు.
tonsure
Nutan Naidu
Madhupriya
Crime News
Visakhapatnam District

More Telugu News