Senex: 40 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex crosses 40k mark after August

  • 304 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 96 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3 శాతానికి పైగా పెరిగిన అల్ట్రాటెక్ షేర్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాలను మూటగట్టుకున్నాయి. ఆగస్ట్ 31 తర్వాత సెన్సెక్స్ మరోసారి 40 వేల మార్కును అధిగమించింది. రూ. 16 వేల కోట్ల విలువైన షేర్ బైబ్యాక్ ను టీసీఎస్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేశారు. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 40,469కి ఎగబాకింది. అయితే ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపడంతో లాభాలు పడిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్ల లాభంతో 40,183కి చేరుకుంది. నిఫ్టీ 96 పాయింట్లు పుంజుకుని 11,835 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.24%), టీసీఎస్ (3.19%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.63%), ఇన్ఫోసిస్ (2.57%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.56%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-2.84%), ఐటీసీ (-1.36%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.81%), ఎల్ అండ్ టీ (-0.75%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.69%).

  • Loading...

More Telugu News