Jagan: విద్యాకానుక బ్యాగ్ భుజానికి తగిలించుకుని సీఎం జగన్ చిరునవ్వులు... ఫొటో ఇదిగో!

CM Jagan inaugurates Jagananna Vidya Kanuka

  • విద్యాకానుక పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
  • కృష్ణా జిల్లా పునాదిపాడు హైస్కూల్లో పథకానికి శ్రీకారం
  • 43 లక్షల మంది విద్యార్థులకు కిట్లు

ఏపీలోని 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పేరిట కిట్ బ్యాగులు అందించే కార్యాచరణను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. కృష్ణా జిల్లా పునాదిపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో సీఎం జగన్ ఈ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఓ కిట్ బ్యాగును స్వయంగా భుజానికి తగిలించుకున్న ఆయన చిరునవ్వులు చిందించారు. జగన్ ఎంతో ఉల్లాసంగా ఉండడాన్ని గమనించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు కూడా నవ్వేయడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

ఈ విద్యాకానుకలో భాగంగా ఓ స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్ ఉంటాయి. యూనిఫాం కుట్టుకూలి కూడా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. జగనన్న విద్యాకానుక కోసం సర్కారు రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది.

Jagan
Jagananna Vidya Kanuka
Kit Bag
  • Loading...

More Telugu News