COVID19: దేశంలో 68 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య.. బులెటిన్ విడుదల చేసిన కేంద్రం

covid 19 cases in India reached to 68 lakh mark
  • గత 24 గంటల్లో 78,524 కేసుల నమోదు
  • దేశంలో ఇంకా 9,02,425 యాక్టివ్ కేసులు
  • ఇప్పటి వరకు 1,05,526 మంది మృతి
దేశంలో కరోనా కేసుల సంఖ్య 68 లక్షల మార్కును దాటేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 78,524 కేసులు నమోదు కాగా, 971 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులు, మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 68,35,656 కేసులు నమోదు కాగా, 1,05,526 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం బులెటిన్ విడుదల చేసింది. దేశంలో ఇంకా 9,02,425 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, 58,27,705 మంది కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
COVID19
India
active cases
corona deaths

More Telugu News