Train Tickets: అమెజాన్ అంగట్లో ఇక రైలు టికెట్లు కూడా అమ్ముతారు!
- అమెజాన్ పే యాప్ ద్వారా అమ్మకాలు
- ఐఆర్ సీటీసీ, అమెజాన్ ఇండియా మధ్య ఒప్పందం
- క్యాష్ డిస్కౌంట్ ఆఫర్లతో టికెట్ల అమ్మకం
ఆన్ లైన్ అమ్మకాల పోర్టల్ అమెజాన్ విక్రయ జాబితాలో మరో అంశం కూడా చేరింది. ఇకపై అమెజాన్ లో రైలు టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఐఆర్ సీటీసీ, అమెజాన్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. అమెజాన్ పే యాప్ ద్వారా ఈ సేవలు లభ్యమవుతాయి.
ఈ యాప్ ద్వారా యూజర్లు రైళ్లలో సీట్ల లభ్యత తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ పై తాజా సమాచారం కూడా లభ్యమవుతుంది. అమెజాన్ పే ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటికే అమెజాన్ పే ద్వారా విమాన, బస్సు టికెట్ల అమ్మకాలు జరుపుతున్నారు.
కాగా, అమెజాన్ పే యాప్ ద్వారా మొదటిసారి టికెట్లు బుక్ చేసే కస్టమర్లకు 10 శాతం నగదు రాయితీ లభించనుంది. ఈ డిస్కౌంట్ గరిష్టంగా రూ.100 వరకు ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ రాయితీ 12 శాతం కాగా, గరిష్టంగా రూ.120 వరకు ఉంటుంది.