Corona Virus: కరోనా కట్టడికి 6 అడుగుల దూరం సరిపోదు: అమెరికా పరిశోధకులు

6 Feet May Not Be Enough To Check Virus Spread

  • కొవిడ్‌-19 రోగి దగ్గినా, తుమ్మినా తుంపర్లలో వైరస్‌
  • గాలి ద్వారా ప్రయాణించి ఇతరులకు సోకే ఛాన్స్‌
  • గాలి, వెలుతురు సరిగ్గా ప్రసరించని ప్రదేశాల్లో అధిక వ్యాప్తి
  • రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తున్న వైరస్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని అమెరికాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) తెలిపింది. కొవిడ్‌-19 రోగి దగ్గినా, తుమ్మినా వెలువడిన తుంపర్లలో వైరస్‌ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో కరోనా గాలి ద్వారా ప్రయాణించి ఇతరులకు అవకాశముంటుందని సీడీసీ వెల్లడించింది.

కరోనా రోగి నుంచి తుంపర్లు కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత  వైరస్‌ నేలపై పడిపోతుంది. దీంతో ఆరు అడుగుల దూరం లోపల ఉన్న వారికి అది‌ సోకే ఛాన్స్ ఉంటుందని ఇప్పటి వరకు అందరూ భావించారు. అయితే, గాలి, వెలుతురు సరిగ్గా ప్రసరించని ప్రదేశాల్లో తుంపర్ల ద్వారా కనీసం రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం వైరస్‌ ప్రయాణించగలదని పరిశోధకులు స్పష్టం చేశారు.

అంటే ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరం ఉన్నప్పటికీ కరోనా‌ వ్యాప్తి చెందుతుంది.‌ గాలిలో ఆ వైరస్ జీవితకాలం ఎంతసేపు ఉంటుందన్న విషయంపై సీడీసీ వివరాలు తెలపలేదు. గాలి, వెలుతురు అధికంగా ఉంటే తుంపర్లు తొందరగా విచ్చిన్నం అవుతాయి, లేదంటే ఆవిరయిపోతాయి. దీంతో కరోనా తొందరగా నాశనం అవుతుంది. ఇంట్లో, ఆఫీసుల్లో గాలి, వెలుతురు అధికంగా ఉండేలా చూసుకోవాలని, అలాగే, కరోనా జాగ్రత్తలు పాటించాలని పరిశోధకులు చెప్పారు.

  • Loading...

More Telugu News