Kichcha Sudeepa: మీతో మాట్లాడడం అద్భుతంగా ఉంది సర్... పవన్ ను కలిసిన ఆనందంలో కిచ్చ సుదీప్ వ్యాఖ్యలు

Kannada star Kichcha Sudeepa met Pawan Kalyan
  • హైదరాబాదులో పవన్ కల్యాణ్ తో సుదీప్ భేటీ
  • జనసేనానికి మొక్కలు బహూకరించిన కన్నడ నటుడు
  • ఇరువురి మధ్య గంటపాటు చర్చ
కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ఇవాళ ఉదయం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. హైదరాబాద్ వచ్చిన కిచ్చ సుదీప్... పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు అనేక విషయాలను చర్చించుకున్నారు. ఇటీవలే సినిమా చిత్రీకరణలు ఊపందుకున్న క్రమంలో తాను నటిస్తున్న కొత్త సినిమాల గురించి పవన్ కు వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైనా, సామాజిక అంశాలపైనా వీరి మధ్య చర్చ జరిగింది.

కాగా, పవన్ ను కలిసిన సందర్భంగా కిచ్చ సుదీప్ కొన్ని మొక్కలను బహూకరించారు. ఈ భేటీపై కిచ్చ సుదీప్ ట్విట్టర్ లో స్పందించారు. ఎంతో నిరాడంబరంగా, ఎంతో నిగర్వంగా ఉండే మనిషి పవన్ కల్యాణ్, ఆయనకు నేను ఫిదా అయ్యాను అంటూ ట్వీట్ చేశారు. మీతో మాట్లాడడం అద్భుతంగా ఉంది సర్ అంటూ స్పందించారు.
Kichcha Sudeepa
Pawan Kalyan
Plants
Hyderabad
Tollywood
Kannada

More Telugu News