Hemanth: హేమంత్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి

Another twist in Hemanth Honour killing case

  • ఈ ఏడాది జూన్10న అవంతి, హేమంత్ ప్రేమ వివాహం
  • వారిని విడదీసేందుకు రెండు నెలలపాటు ప్రయత్నం
  • ఓ గ్యాంగ్ తప్పుకోవడంతో మరో ముఠాతో ఒప్పందం

సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హేమంత్‌ను హత్యచేసేందుకు తొలుత ఓ గ్యాంగ్‌తో రూ. 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న యుగంధర్‌రెడ్డి లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు తమకు సమాచారం ఇస్తే కిడ్నాప్ చేస్తామని ముఠా సభ్యుడు చెప్పాడు. ఇందుకోసం రెండుమూడుసార్లు రెక్కీ నిర్వహించిన అనంతరం ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఇప్పుడు వద్దంటూ అతను వాయిదా వేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో బిచ్చూ యాదవ్ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని హత్య చేయించాడు.

ఈ ఏడాది జూన్ 10న అవంతి, హేమంత్‌లు వివాహం చేసుకున్నారు. దీంతో తట్టుకోలేకపోయిన అవంతి కుటుంబ సభ్యులు వారిని విడదీసేందుకు ప్రయత్నించారు. అవంతిని తమవైపు తిప్పుకునేందుకు దాదాపు రెండు నెలలపాటు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో హేమంత్‌ను కిడ్నాప్ చేసి బెదిరించి విడదీయాలని భావించారు. అందులో భాగంగా యుగంధర్ రెడ్డి ఓ గ్యాంగును సంప్రదించాడు. అయితే, ఆ ముఠా తప్పుకోవడంతో బిచ్చూ యాదవ్‌ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని హత్య చేయించాడు. కాగా, అవంతి తండ్రి లక్ష్మారెడ్డి జైలులో ఉండడంతో అతడు నిర్వహిస్తున్న రేషన్ దుకాణం మూతబడింది.

  • Loading...

More Telugu News