Samantha: 'తక్కాలి సదం' రెసిపీ చేసిన సమంత... ఉత్తమ కోడలు నువ్వేనన్న ఉపాసన

Samantha impresses Upasana with tasty recipe
  • యువర్ లైఫ్ వెబ్ సైట్ కోసం సమంత, ఉపాసన వంట
  • వేగంగా రెసిపీ చేసిన సమంత
  • నాగచైతన్య అదృష్టవంతుడంటూ ఉపాసన
టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన, యువ హీరో నాగచైతన్య అర్ధాంగి సమంత మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తాజా ఓ వీడియోలో సందడి చేశారు. 'తక్కాలి సదం' (టమోటా రైస్) రెసిపీ చేసి అభిమానులను అలరించారు. సమంత బ్రౌన్ రైస్ తో టమోటా రైస్ చేస్తుండగా, ఉపాసన పర్యవేక్షించారు. వీళ్లిద్దరూ 'యువర్ లైఫ్' (URLife.co.in) పేరిట వెబ్ సైట్ నిర్వహిస్తున్నారు. ఈ వెబ్ సైట్ కు సమంత గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవనవిధానాన్ని ప్రచారం చేయడమే ఈ వెబ్ సైట్ ముఖ్యోద్దేశం.

ఇక, 'తక్కాలి సదం' రెసిపీని సమంత కొన్ని నిమిషాల్లో చేయడంతో ఉపాసన ఆశ్చర్యపోయారు. నాగచైతన్య ఎంతో లక్కీ అంటూ వ్యాఖ్యానించారు. సమంత ఉత్తమ కోడలు అంటూ కితాబిచ్చారు. అయితే సమంత... నేను కాదు ఉపాసనే ఉత్తమ కోడలు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో నెట్టింట విశేషంగా సందడి చేస్తోంది.
Samantha
Upasana
Thakkali Sadam
Tomato Rice

More Telugu News