IPL 2020: ఏ జట్టూ పెద్దగా రాణించని మ్యాచ్ లో... సన్ రైజర్స్ కు ఓటమి!

KKR Defeted SRH

  • మరో 2 ఓవర్లు మిగిలి వుండగానే కేకేఆర్ విజయం
  • హాఫ్ సెంచరీతో రాణించిన శుభమన్ గిల్
  • ఐపీఎల్ లో హైదరాబాద్ కు రెండో ఓటమి

అబూదాబీలో గత రాత్రి ఐపీఎల్ 13వ సీజన్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ ఓడిపోయి, వరుసగా రెడో ఓటమిని మూటగట్టుకుంది. కోల్ కతా జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఏ జట్టూ సమష్టిగా రాణించకపోవడం గమనార్హం. మెరుపులు లేవు, ఆలౌట్లు లేవు, టెయిలెండర్ల వరకూ బ్యాటింగ్ రాలేదు. వికెట్లను కోల్పోయింది తక్కువే అయినా, తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు తక్కువ పరుగులకే పరిమితం కాగా, ఆ స్కోరును ఛేదించిన  జట్టు సునాయాసంగా చేరుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్, 143 పరుగులు సాధించింది. దీన్ని కేకేఆర్ మరో 2 ఓవర్లు మిగిలివుండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కోల్ కతా నైట్ రైడర్స్ విజయంలో శుబ్‌ మన్‌ గిల్ 70 పరుగులు, నితీష్‌ రాణా 26 పరుగులతో తమదైన పాత్ర వహించగా, ఇయాన్‌ మోర్గాన్‌ 42 పరుగులతో నాటౌట్ గా నిలిచి లాంఛనాన్ని పూర్తి చేశాడు.

టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు మొదట్లోనే జానీ బెయిర్‌ స్టో వికెట్‌ ను కోల్పోయింది. ఆపై వార్నర్‌ కు జత కలిసిన మనీష్‌ పాండే, సహా, దాని తరువాత సాహాల జోడీ ముందుకు సాగుతున్నట్టు కనిపించినా, కేకేఆర్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ ముందు వారి ఆట సాగలేదు. 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసిన సన్ రైజర్స్, స్లాగ్‌ ఓవర్లలో పరుగులు సాధించలేక తడబడింది.

IPL 2020
Hyderabad
Sunrisers Hyderabad
Kolkata Knight Riders
  • Loading...

More Telugu News