India: భారీగా దిగివచ్చిన బంగారం ధర!
- ఆల్ టైమ్ హై నుంచి రూ. 6,500 తగ్గుదల
- శుక్రవారం మరో రూ. 408 పతనం
- రూ. 58 వేలకు చేరువైన కిలో వెండి ధర
ఇటీవలి కాలంలో పది గ్రాముల బంగారం ధర ఆల్ టైమ్ హై నుంచి రూ. 6,500 మేరకు తగ్గింది. గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు ధరలు పడిపోయాయి. తాజాగా, శుక్రవారం నాడు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో రూ. 408 పతనమై రూ. 49,496కు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒత్తిడి కొనసాగుతూ ఉండటమే దీనికి కారణమని విశ్లషకులు అంచనా వేస్తున్నారు. ఇక, కిలో వెండి ధర రూ. 1,506 పడిపోయి రూ. 58,123కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.2 శాతం తగ్గి, 1,864 డాలర్లకు చేరింది.