: కీలక సంస్థలకు వెన్నుముక లేని వ్యక్తులా?: ఆమ్ ఆద్మీ పార్టీ
కొత్త కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ప్రభుత్వం రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మ నియామకాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుపట్టింది. కాగ్, సీవీసీ, సీఐసీ లాంటి కీలక సంస్థలకు వెన్నుముక లేని వ్యక్తుల్ని నియమించడం ద్వారా యూపీఏ ప్రభుత్వం ఆయా సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఏఏపీ నేత, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఢిల్లీలో అన్నారు.