ACB: అక్రమాస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి అరెస్ట్
- వరంగల్, కరీంనగర్, నల్గొండ, అనంతపురంలలో ఏకకాలంలో తనిఖీలు
- ప్రాథమికంగా రూ. 70 కోట్ల ఆస్తి గుర్తింపు
- నేడు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు
అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది. అంతకుముందు సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని నరసింహారెడ్డి ఇల్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో 25 చోట్ల తనిఖీలు చేపట్టారు.
వరంగల్, కరీంనగర్, నల్గొండ, అనంతపురంలలో అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మొత్తం 70 కోట్ల ఆస్తులును ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్‌లో 3 ఇళ్లు, 5 ఇంటి స్థలాలు ఉన్నట్టు కనుగొన్నారు. నరసింహారెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆయనను నాంపల్లిలోని తమ కార్యాలయానికి తరలించారు. నేడు ఏసీబీ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు.