Wu Tinazhen: ఈ చైనా అమ్మాయి విన్యాసాలు చూస్తే మతిపోవాల్సిందే... వీడియో ఇదిగో!

China girl mesmerizes with her acrobatic skills
  • ఆక్రోబాటిక్స్ లో అదరగొడుతున్న చైనా అమ్మాయి
  • కాలితో గురితప్పకుండా బాణం సంధించిన వు తియాంజెన్
  • సైకిల్ పైనా విన్యాసాలు
జిమ్నాస్టిక్ విన్యాసాలకు చైనా పెట్టింది పేరు. ఒలింపిక్స్ నుంచి ప్రపంచ జిమ్నాస్టిక్ చాంపియన్ షిప్ వరకు రష్యా ఆధిపత్యాన్ని సవాల్ చేసి, పైచేయి సాధించడం చైనాకే చెల్లింది. ఇప్పుడీ వీడియోలోని అమ్మాయి చేసే ఆక్రోబాటిక్ విన్యాసాలు చూస్తే చైనీయులు ఈ విద్యలో ఎంత పట్టు సాధించారో అర్థమవుతుంది. వు తియాంజెన్ కళాత్మక నైపుణ్యం చూస్తే ఆమె శరీరంలో స్ప్రింగులేమైనా ఉన్నాయా, అసలు ఎముకలే లేవా అనేంతగా విస్మయానికి గురిచేస్తుంది.

ఉత్తర చైనాలోని షాండోంగ్ ప్రావిన్స్ కు చెందిన వు తియాంజెన్ అత్యంత క్లిష్టమైన ఆక్రోబాటిక్ విన్యాసాలను సైతం అలవోకగా చేస్తూ క్రీడా పండితులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. చేతులను బార్ పై బ్యాలెన్స్ చేస్తూ కాలితో బాణాన్ని సంధించడం చూస్తే ఎవరైనా సమ్మోహితులు కావాల్సిందే. అది కూడా గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడం వు తియాంజన్ కు మాత్రమే సాధ్యమంటే అతిశయోక్తి కాదు. పైగా సైకిల్ పైనా ఆమె చేసే విన్యాసాలు అందరినీ అచ్చెరువొందిస్తున్నాయి.
Wu Tinazhen
Acrobatics
China
Archery
Cycling

More Telugu News