: రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రజల ముందుకు తేవాలి: కమల్ నాథ్
వచ్చే ఎన్నికల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రజల ముందుకు తేవాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కమల్ నాథ్ అన్నారు. రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత సమర్థవంతమైన పాలనను అందిస్తుందని అభిప్రాయ పడ్డారు. దేశంలో యువతను ప్రోత్సహించడానికి ముందడుగులా రాహుల్ కు పగ్గాలు అప్పగించాలని యూపీఏ-2 నాలుగో వార్షికోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు.