hritik roshan: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య ఆసక్తికర వ్యాఖ్యలు

hritik wife comment on insta

  • నన్ను వదిలి వెళ్లిపోయిన వారి కోసం చింతించను
  • ఎవరి కోసమో బాధ పడను
  • అందుకు ఒక్క రోజు కూడా వృథా చేయను

బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె, హృతిక్ రోషన్   2014లో విడిపోయారు. అయినప్పటికీ, వారిద్దరు పలు సందర్భాల్లో కలిశారు. తన పిల్లలను చూడడానికి హృతిక్‌ ఆమె వద్దకు వస్తుంటాడు.

అయితే, సుసానే ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటో ఒకటి పోస్ట్ చేసి, తనను వదిలి వెళ్లిపోయిన వారి కోసం ఏడవనని కామెంట్ చేసింది. తాను ఎవరి కోసమో బాధ పడుతూ ఒక్క రోజు కూడా వృథా చేయనని తెలిపింది. ఆమె ఇలా ఎందుకు కామెంట్ చేసిందోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సమయంలోనూ పిల్లలకు ధైర్యం చెప్పేందుకు హృతిక్‌ రోషన్, సుసానే ఖాన్ కొన్ని రోజులు ఒకే ఇంట్లో కలిసి నివసించిన విషయం తెలిసిందే.

hritik roshan
Bollywood
Instagram
  • Loading...

More Telugu News