Telangana: తెలంగాణ కరోనా కేసుల తాజా బులెటిన్ విడుదల.. మరో 2,273 కేసులు వెలుగులోకి!

corona deaths in Telangana nearest to thousand
  • నిన్న 55,636 మందికి పరీక్షలు
  • మొత్తం మరణాల సంఖ్య 996
  • నిన్న ఒక్కరోజే కోలుకున్న 2,260 మంది
తెలంగాణలో కొత్తగా మరో 2,273 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. నిన్న మొత్తం 55,636 మందికి పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు బయటపడ్డాయి. వీటితో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,62,844 మంది ఈ మహమ్మారి బారినపడినట్టు నిర్ధారణ అయింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ‌లో పేర్కొంది. ఇక, గత 24 గంటల్లో కరోనా కారణంగా 12 మంది మృతి చెందడంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా మరణాల సంఖ్య 996కు చేరింది.

కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,260 మంది కోలుకోవడంతో ఈ మహమ్మారి బారినుంచి మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,31,447కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 30,401 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 23,569 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక, రాష్ట్రంలో ఇప్పటి వరకు 22,76,222 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Telangana
Corona Virus
corona deaths

More Telugu News