Hawala: హైదరాబాదులో హవాలా రాకెట్ గుట్టురట్టు... రూ.3.75 కోట్లు స్వాధీనం

Hawala rocket busted by west zone task force police in Hyderabad

  • బంజారాహిల్స్ లో నలుగురి అరెస్ట్
  • హైదరాబాద్ నుంచి షోలాపూర్ కు నగదు తరలిస్తున్నట్టు గుర్తింపు
  • నగదు ఇన్ కమ్ ట్యాక్స్ విభాగానికి అప్పగింత

హైదరాబాదులో భారీ హవాలా రాకెట్ గుట్టు బయటపడింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ ప్రాంతంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. హవాలా మార్గాల్లో నగదు తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా రూ.3.75 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో ఆ నలుగురు వ్యక్తులు ముంబయికి చెందిన ఓ సంస్థలో పనిచేస్తున్నట్టు తేలింది. ఆ సంస్థ యజమాని అహ్మదాబాద్ కు చెందినవాడిగా తెలిసింది. హైదరాబాదులో బ్రాంచి ఏర్పాటు చేసి మహారాష్ట్రలోని షోలాపూర్ కు నగదు తరలిస్తున్నట్టు గుర్తించారు. కాగా స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు అప్పగించారు. తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News