Suicide: ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పురుషులే అత్యధికం!

suicide rate High in men than women in India

  • బలవన్మరణాలకు పాల్పడుతున్న వారిలో 70.2 శాతం మంది పురుషులు
  • నగరాల్లో  అత్యధికంగా ఆత్మహత్యల రేటు
  • కుటుంబ సమస్యల కారణంగా 32.4 శాతం మంది ఆత్మహత్య

దేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే అత్యధికమని జాతీయ నేర గణాంక విభాగం (ఎస్‌సీఆర్‌బీ) వెల్లడించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2019లో సగటున రోజుకు 381 మంది చేసుకుంటున్నారు. వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. గతేడాది 1,39,123 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది అత్యధికం. 2018లో 1,34,516 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక, ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 70.2 శాతం మంది పురుషులు ఉండగా, మహిళల శాతం 29.8.

వివాహం తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పురుషుల సంఖ్యే అధికమని ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. వివాహం తర్వాత 68.4 శాతం మంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పగా, 62.5 శాతం మంది మహిళలు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు.

నగరాల్లోనే ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉందని ఎస్‌సీఆర్‌బీ పేర్కొంది. ఇక, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 53.6 శాతం ఉరివేసుకోగా, 25.8 శాతం మంది విషం తీసుకుని, 5.2 శాతం మంది నీళ్లలో మునిగి, 3.8 శాతం నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు.

కుటుంబ సమస్యల కారణంగా 32.4 శాతం మంది, వివాహ సంబంధిత సమస్యల కారణంగా 5.4 శాతం మంది, అనారోగ్య కారణాల వల్ల 17.5 శాతం మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

Suicide
Man
Women
India
NCRB
  • Loading...

More Telugu News