Bommana Raj kumar: ప్రముఖ వస్త్ర, జ్యూయలరీ వ్యాపారి, వైసీపీ నేత ‘బొమ్మన’ కరోనాతో కన్నుమూత
- 27 రోజులుగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స
- రాజకీయ ప్రముఖులు, వస్త్రవ్యాపారుల నివాళి
- 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున అసెంబ్లీకి పోటీ
రాజమహేంద్రవరంకు చెందిన ప్రముఖ వస్త్ర, నగల వ్యాపారి, వైసీపీ నాయకుడు బొమ్మన రాజ్‌కుమార్ (62) కన్నుమూశారు. కరోనా బారినపడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత 27 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న మృతి చెందారు. నేడు ఆయన స్వగ్రామమైన దోసకాయలపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు, వస్త్రవ్యాపారులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతికి సంతాపంగా వ్యాపార సంస్థలను మూసివేశారు.
రాజ్‌కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2001 నుంచి 19 ఏళ్లుగా ఏకధాటిగా ది జాంపేట కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా ఉన్నారు. ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా 5 ఏళ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం మొట్టమొదటి నగర కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2014 ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019 ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరించారు.