Airtel: రూ.10 లేస్ కొంటే 1 జీబీ డేటా... పెప్సీకోతో ఎయిర్ టెల్ డీల్1

One GB Data Free With 10 Rupees Lays

  • కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్
  • డేటాను మూడు రోజుల్లో వాడుకోవాలి
  • వెల్లడించిన ఎయిర్ టెల్

ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్ ‌టెల్ తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ స్నాక్, కూల్ డ్రింక్ బ్రాండ్ పెప్సీకోతో డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, ఉచిత ఇంటర్నెట్ డేటాను అందించేలా ఆఫర్లను ప్రకటించాలని నిర్ణయించింది. లేస్, కుర్ కురే, అంకుల్ చిప్స్ తదితర ప్యాక్ లను కొనుగోలు చేసే వారికి ఉచితంగా ఇంటర్నెట్ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. రూ. 10 ప్యాక్ తో 1 జీబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా ఇస్తామని చెబుతోంది. 

ఇక ఈ ఉచిత డేటాను పొందడానికి, ప్యాకెట్ వెనుక భాగంలో ఉన్న ఉచిత రీఛార్జ్ కోడ్ ‌ను ఎయిర్ ‌టెల్ థాంక్స్ యాప్ ‌లోని కూపన్స్ విభాగంలో నమోదు చేయాలని, రూ. 10 విలువైన చిప్స్ పై 1 జీబీ, రూ.20 విలువైన చిప్స్ పై 2 జీబీ లభిస్తుందని, కూపన్ రిడీమ్ చేసిన తరువాత మూడు రోజుల్లో డేటాను వాడుకోవాలని ఎయిర్ టెల్ ప్రకటించింది. ఇకపై తమ వినియోగదారులు డిజిటల్ కంటెంట్  చూస్తూ, తమ ఉత్పత్తులను ఎంజాయ్ చేయవచ్చని పెప్సికో ఇండియా సీనియర్ డైరెక్టర్  (కేటగిరీ హెడ్ ఫుడ్స్ విభాగం) దిలేన్ గాంధీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News