Jagan: నైపుణ్యాభివృద్ది కాలేజీల కోసం స్థల సేకరణను వేగవంతం చేయండి: అధికారులతో జగన్

Jagan hold review meeting on skill development colleges

  • 30 కాలేజీలను నిర్మించనున్న ఏపీ ప్రభుత్వం
  • భవనాల నిర్మాణం నాణ్యంగా ఉండాలన్న జగన్
  • ఇప్పటికే 20 స్థలాలను గుర్తించామన్న అధికారులు

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక నైపుణ్యాభివృద్ది కాలేజీ ఉండేలా మొత్తం 30 కాలేజీల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కళాశాలల నిర్మాణం కోసం స్థలాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.

ఈరోజు ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలేజీల భవనాల నిర్మాణం నాణ్యంగా ఉండాలని చెప్పారు. ఉత్తమ మానవ వనరులను పారిశ్రామిక రంగానికి అందించడంతో పాటు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఈ కాలేజీలు కీలక పాత్రను పోషించబోతున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, కాలేజీల కోసం ఇప్పటికే 20 చోట్ల స్థలాలను గుర్తించినట్టు చెప్పారు. అనంతరం జగన్ మాట్లాడుతూ, పరిశ్రమలకు ఏం కావాలో సర్వే చేయాలని... దానికి తగ్గట్టుగా కోర్సులను రూపొందించాలని ఆదేశించారు. 162కు పైగా కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించాలని చెప్పారు. ఈ సమీక్ష కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డిలతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

.

  • Loading...

More Telugu News