sajjala: వెన్నుపోటు, అప్రజాస్వామిక పద్ధతులతో చంద్రబాబు గారు పీఠమెక్కిన రోజు ఇది: సజ్జల రామకృష్ణారెడ్డి

sajjala slams chandrababu

  • ఏనాడూ ఆయన ప్రజల్లోనుంచి అధికారాన్ని తెచ్చుకోలేదు
  • ఎత్తులు, కుట్రలు, మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలు జరిపారు
  • స్వయంప్రకటిత మేధావిగా బండి ఈడ్చారు
  • 14 ఏళ్ల పాలనలో గుర్తించుకోదగ్గ ఒక పనీ చేయలేదు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. 'వెన్నుపోటు, అప్రజాస్వామిక పద్ధతులతో చంద్రబాబు గారు పీఠమెక్కిన రోజు ఇది. ఏనాడూ ఆయన ప్రజల్లోనుంచి అధికారాన్ని తెచ్చుకోలేదు. ఎత్తులు, కుట్రలు, మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలతో, అనుకూల మీడియా చిత్రించిన స్వయంప్రకటిత మేధావిగా బండి ఈడ్చారు' అని విమర్శించారు.

'తన 14 ఏళ్ల పాలనలో ప్రజలు గుర్తించుకోదగ్గ ఒక పనీ చేయలేదు. విద్య, వైద్యం, ఆరోగ్య వ్యవస్థలను తన మనుషులకు, బినామీదార్లకు అమ్మేశారు. చివరకు పాలవ్యాపారాన్నీ గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. సంక్షోభ సమయాల్లో ప్రజలను వదిలేసి మీడియా విన్యాసాలతో చరిత్రహీనుడిగా మిగిలిపోయారు' అని సజ్జల పేర్కొన్నారు.

'పోరాటాలనుంచి ఎదిగిన నాయకుడు జగన్‌గారు. ప్రజలనుంచి అధికారాన్ని తెచ్చుకున్నారు. కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలతో పరుగులు పెట్టించి ఆదర్శనీయంగా నిలిచారు. కుట్రల నాయుడుగారికీ, ప్రజా నాయకుడికీ తేడాను స్పష్టంగా ప్రజలు చూస్తున్నారు' అని సజ్జల చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News