India: వ్యాక్సిన్ సంగతేంటి? ఎంతవరకూ వచ్చింది?: ప్రశ్నించిన కేంద్ర కమిటీ!

Center Asks What About Vaccine to Farma Companies

  • ప్రత్యేక సమీక్షను నిర్వహించిన కేంద్రం
  • ట్రయల్స్ పై వివరాల సేకరణ
  • వివిధ దేశాల్లో వ్యాక్సిన్ పరీక్షలపై కూడా

ఇండియాలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఎంతవరకూ వచ్చాయన్న విషయమై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమీక్షను నిర్వహిస్తూ, ట్రయల్స్ చేస్తున్న కంపెనీలపై పలు ప్రశ్నలను సంధించింది. ప్రస్తుతం ఇండియాలో మూడు వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్, జైడస్ కాడిలా సంస్థలు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే సంవత్సరం తొలి నాళ్లలో మార్కెట్లోకి రావచ్చన్న వార్తలు వస్తున్న వేళ, పరిస్థితి ఎంతవరకూ వచ్చిందన్న విషయాన్ని సమీక్షించేందుకు కేంద్రం రివ్యూ మీటింగ్ నిర్వహించింది.

నీతి ఆయోగ్ ప్రతినిధి, మెడికల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ప్లాన్ గ్రూప్ చైర్ పర్సన్ డాక్టర్ వినోద్ కే  పాల్ నేతృత్వంలోని ఉన్నత కమిటీ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఒక్క భారత్ లో జరుగుతున్న ట్రయల్స్ మాత్రమే కాకుండా, వివిధ దేశాల్లో జరుగుతున్న ప్రయోగ పరీక్షలను గురించి కూడా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా 29 వ్యాక్సిన్ క్యాండిడేట్లపై పరీక్షలు జరుగుతున్నాయని,వాటిల్లో రెండు భారత్ సొంతమని అధికారులు వివరించగా, అన్నింటి పరీక్షా ఫలితాలపైనా ఆరా తీయాలని తెలిపారు. ఈ 29 వ్యాక్సిన్లలో ప్రస్తుతం ఆరు తుది దశ పరీక్షల్లో ఉండగా, వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

  • Loading...

More Telugu News