Genelia: మూడు వారాల క్రితమే నాకు కరోనా అని తేలింది: జెనీలియా

Actress Genelia was in isolation for 21 days

  • 21 రోజులు ఐసొలేషన్ లో ఉన్నా
  • తాజా టెస్టులో నెగెటివ్ అని వచ్చింది
  • ఇన్ని రోజులు ఐసొలేషన్ లో ఉండటం బాధించింది

సినీ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. పలు విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించిన జెనీలియా కూడా కరోనా బారిన పడిందట. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ ద్వారా ఆమె వెల్లడించింది. మూడు వారాల క్రితమే తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని... అయితే, లక్షణాలు లేవని ఆమె తెలిపింది. ఆ తర్వాత 21 రోజుల పాటు తాను ఐసొలేషన్ లో ఉన్నానని చెప్పింది. భగవంతుడి దయ వల్ల తాను కోలుకున్నానని... తాజా టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని తెలిపింది.

కరోనా వల్ల తాను ఎక్కువగా ఇబ్బంది పడకపోయినా... ఇన్ని రోజులు ఐసొలేషన్ లో ఉండటం ఎంతో బాధించిందని ఈ సందర్భంగా జెనీలియా చెప్పింది. ఒంటరిగా గడపడం ఛాలెంజింగ్ గా అనిపించిందని వ్యాఖ్యానించింది. కరోనా నుంచి కోలుకుని కుటుంబసభ్యుల మధ్యకు రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపింది. మన చుట్టూ కావాల్సిన వాళ్లు ఉన్నప్పుడు... అది మనకు ఎంతో బలాన్ని, శక్తిని ఇస్తుందని చెప్పింది. ప్రతి ఒక్కరూ ముందుగానే టెస్టులు చేయించుకోవడం, ఫిట్ గా ఉండటం, మంచి ఆహారం తీసుకోవడం చేస్తే... కరోనాపై విజయం సాధించవచ్చని తెలిపింది.

Genelia
Tollywood
Bollywood
Corona Virus
  • Loading...

More Telugu News