Tamil Nadu: కరోనా వేళ.. తమిళనాడులో ఒకే రోజు 200 పెళ్లిళ్లు!

 200 weddings in a single day in Tamilnadu

  • నిర్ణీత సమయంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వివాహాలు
  • తెల్లవారుజామునే మొదలైన పెళ్లిళ్లు
  • రద్దీగా మారిన ఆలయాలు

తమిళనాడులో కరోనా కేసులు ఉద్ధృతంగా కొనసాగుతున్న వేళ నిన్న ఒక్క రోజే 200కుపైగా వివాహాలు జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మధురై, తిరుపరన్‌కుండ్రం, కడలూరులో ఈ పెళ్లిళ్లు జరిగాయి.

మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం, తల్లాకుళం పెరుమాళ్‌ ఆలయం, తిరుపరన్‌కుండ్రం  మురుగన్‌ ఆలయాల ఎదుట వందకు పైగా జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. అలాగే, తిరుప్పరంగుండ్రం మురుగన్‌ ఆలయంలో 50, కడలూరు సమీపంలోగల తిరువందిపురం ప్రాంతంలోని కల్యాణ మండపంలో 50కి పైగా వివాహాలు జరిగాయి. తెల్లవారుజామున మొదలైన వివాహాలు సాయంత్రం వరకు నిర్ణీత సమయంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగాయి. పెళ్లిళ్లతో ఆయా ఆలయాలు రద్దీగా మారాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News