Vijay Sai Reddy: బషీర్‌ బాగ్ ‌లో చంద్రబాబు సృష్టించిన మారణ హోమానికి నేటితో 20 ఏళ్లు: విజయసాయి

Vijayasai Comment on 2000 Basheerbagh Firing

  • బషీర్ బాగ్ కాల్పుల ఘటనపై ట్వీట్
  • అది చంద్రన్న రక్తపాత దినోత్సవం
  • నువ్వు ఎంత క్రూరుడివో అంటూ విమర్శలు

హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లో నిరసనకారులపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తు చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, తన ట్విట్టర్ వేదికగా, చంద్రబాబుపై మరోసారి విమర్శలు కురిపించారు.

మూడు రోజుల నాడు 'వెన్నుపోటు డే' జరుపుకున్న ఆయన నేడు 'రక్తపాత దినోత్సవం' చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు. "విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్ 25న ''వెన్నుపోటు'' దినోత్సవం జరుపుకున్న బాబు.. ఆగస్ట్ 28 ''చంద్రన్న రక్తపాత దినోత్సవం'' జరుపుకుంటున్నారు. బషీర్‌ బాగ్ ‌లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు. నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుంది బాబు" అంటూ ట్వీట్ చేశారు. 

Vijay Sai Reddy
Basheerbagh
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News