China: చైనా నావికా విన్యాసాలు.. విమాన విధ్వంసక క్షిపణుల ప్రయోగం

China fires two missiles into south china sea
  • 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు
  • నావికాదళ విన్యాసాల్లో భాగంగా తొలిసారి ప్రయోగం
  • అమెరికా గూఢచార విమానాలు తిరుగుతున్నాయని ఆరోపణ
దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనా బుధవారం రెండు విమాన వింధ్వసక క్షిపణులను తొలిసారి ప్రయోగించింది. నావికాదళ విన్యాసాల్లో భాగంగా వీటిని ప్రయోగించింది. డీఎఫ్-21డి, డీఎఫ్-26డి క్షిపణలను చైనా దక్షిణ చైనా సముద్రంలోకి ప్రయోగించినట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్టు’ పేర్కొంది. ఈ రెండు క్షిపణులు 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా తుత్తునియలు చేయగలవని తెలిపింది.

కాగా, అమెరికా గూఢచార విమానాలు వివాదాస్పద భూభాగంలో తిరుగుతున్నాయని ఈ సందర్భంగా చైనా ఆరోపించింది. వాటిని హెచ్చరించేందుకే వీటిని ప్రయోగించినట్టు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై తమకు పూర్తి అధికారాలున్నాయని చైనా పేర్కొంది. అయితే, చైనా ప్రకటనపై వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనే, తైవాన్‌లు విభేదిస్తున్నాయి.
China
Missiles
South China sea
America

More Telugu News