Arnold Spielburg: పీసీ పితామహుడు ఆర్నాల్డ్ స్పీల్ బర్గ్ ఇకలేరు!

Steven Spielberg Father Passes Away

  • 103 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఆర్నాల్డ్
  • కంప్యూటర్ల అభివృద్ధిలో కీలకపాత్ర
  • స్టీవెన్ స్పీల్ బర్గ్ కు పితృవియోగం

టెక్నాలజీ ఎక్స్ పర్ట్, పర్సనల్ కంప్యూటర్ల అభివృద్ధిలో ఎంతో కృషి చేసిన ఆర్మాల్డ్ స్పీల్ బర్గ్ కన్నుమూశారు. ఆయన వయసు 103 సంవత్సరాలు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కు ఆర్మాల్డ్ స్వయానా తండ్రి. కుమారుడు, కుటుంబ సభ్యుల మధ్య ఆయన ప్రశాంతంగా కన్నుమూశారని, స్పీల్ బర్గ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

1970, 80 దశకాల్లో పీసీలు అందుబాటులోకి వచ్చాయంటే, 1950లో ఆర్నాల్డ్ చేసిన కృషే కారణం. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థలో పనిచేస్తూ, సహోద్యోగి అయిన ప్రాప్ స్టర్ తో కలిసి 'స్పీల్ బర్గ్ జీఈ-225' అనే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ను తయారు చేశారు. ఈ స్ఫూర్తితోనే 'బేసిక్' ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని డార్ట్ మౌత్ కాలేజ్ పరిశోధకులు తయారు చేశారు. ఈ లాంగేజ్వ్ సాయంతోనే ఆపై కంప్యూటర్లు తయారు అయ్యాయి. 1917లో జన్మించిన ఆయన, తన సుదీర్ఘ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశారు. యూఎస్ లోని సిన్సినాటి ప్రాంతానికి వలస వచ్చిన ఉక్రెయిన్ కు చెందిన యూదు దంపతులకు ఆర్నాల్డ్ జన్మించారు.

  • Loading...

More Telugu News