kollywood: నిత్యానందను అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు: నటి మీరామిథున్

Actress Meera Mithun supports Godman Nityananda
  • నిత్యానందకు అండగా కోలీవుడ్ నటి
  • అతడు రోజురోజుకు మరింత శక్తిమంతంగా మారుతున్నాడని కితాబు
  • త్వరలోనే అతడి కైలాస దేశానికి వెళ్తానన్న మీరా
వివాదాస్పద స్వామీజీ నిత్యానందపై కోలీవుడ్ నటి మీరామిథున్ ప్రశంసలు కురిపించింది. అందరూ కలిసి ఆయనను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నిత్యానంద రోజురోజుకు మరింత శక్తిమంతంగా మారుతున్నారని పేర్కొంది.  తాను త్వరలోనే నిత్యానంద కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నట్టు తెలిపిన నటి.. ‘లాట్స్ ఆఫ్ లవ్’ అని ట్వీట్ చేసింది.

కాగా, భారత్ నుంచి పరారైన నిత్యానంద ఓ దీవిని కొనుగోలు చేసి, దానిని ‘రిపబ్లిక్ ఆఫ్ కైలాస’ పేరిట ప్రత్యేక దేశంగా ప్రకటించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ఏర్పాటు చేసి కరెన్సీని కూడా ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. కాగా, మీరామిథున్ చేసిన ట్వీట్ కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.
kollywood
Actress Meera Mithun
Godman Nityananda

More Telugu News