Kuwait: 60 ఏళ్లు దాటిన డిగ్రీ లేని విదేశీ పనివారి కోసం కువైట్ కొత్త నిబంధన!
- 60 ఏళ్లు దాటితే వర్క్ పర్మిట్ ఇవ్వకూడదని నిర్ణయం
- 2021 జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి
- విదేశీ పనివారిని తగ్గించే క్రమంలో నిబంధన
విదేశీ వర్కర్ల విషయంలో కువైట్ ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. 60 ఏళ్లు దాటిన యూనివర్సిటీ డిగ్రీ లేనివారికి ఇకపై వర్క్ పర్మిట్ ఇవ్వకూడదని నిర్ణయించింది.
ఈ నిబంధన వల్ల 60 ఏళ్లు దాటిన డిగ్రీ లేని వారు పని కోసం కువైట్ కు వెళ్లలేరు. అంతేకాదు, ఇలాంటి వారు కువైట్ వీడి, వారి దేశాలకు తిరుగుపయనం కావాల్సి ఉంటుంది. 59 ఏళ్లు దాటిన వారి వర్క్ పర్మిట్ ను కేవలం ఒక ఏడాదికి మాత్రమే పొడిగించనున్నారు. 2021 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.
ఇక ఈ నిబంధన వేలాదిమంది విదేశీయులపై ప్రభావం చూపనుంది. విదేశీ పనివారిని తగ్గించుకోవాలన్న ప్రణాళికలో భాగంగా కువైట్ ప్రభుత్వం ఈ నిబంధనను తెస్తోంది. ప్రస్తుతం కువైట్ లో విదేశీ పనివారు 3,60,000 మంది వుండగా, వీరిలో 1,50,000 మంది అరవై ఏళ్లు పైబడిన వారే కావడం గమనార్హం!