: మండే సూర్యుడు... రాష్ట్రవ్యాప్తంగా రికార్డు ఉష్ణోగ్రతల నమోదు


సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్న ఆనందం మిగల్చకుండా భానుడు భగభగలాడుతున్నాడు. ఉదయం పది గంటలకే రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రామగుండంలో 46 డిగ్రీలు దాటగా, నిజామాబాద్ లో 45 డిగ్రీలు, నెల్లూరు లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన ప్రధాన పట్టణాలు హైదరాబాదు, కాకినాడ, తిరుపతిల్లో 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. మరో వైపు ఉత్తర భారతాన్ని కూడా సూర్యుడు వేపుతున్నాడు. ఢిల్లీ, ముంబైల్లో 46 డిగ్రీలు నమోదవుతున్నాయి. దీంతో దేశం మొత్తం వడగాడ్పులకు బెంబేలెత్తి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

  • Loading...

More Telugu News