Rohit Sharma: మరో ఘనతను సాధించిన రోహిత్ శర్మ
- పూర్తి స్థాయి కెప్టెన్ కాకుండానే ఖేల్ రత్నకు ఎంపిక
- గతంలో ఈ అవార్డును సొంతం చేసుకున్న సచిన్, ధోనీ, కోహ్లీ
- ఖేల్ రత్నను సొంతం చేసుకున్న నాలుగో క్రికెటర్ గా రోహిత్
టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పురస్కారం టీమిండియా కెప్టెన్లుగా సేవలందించిన సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలకు దక్కింది. వారి తర్వాత ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్న నాలుగో క్రికెటర్ గా రోహిత్ నిలిచాడు.
అయితే, ఇక్కడ కూడా రోహిత్ ఒక ఘనతను సాధించాడు. సచిన్, ధోనీ, కోహ్లీలు పూర్తి స్థాయి కెప్టెన్లుగా వ్యవహరించారు. రోహిత్ పూర్తి స్థాయి కెప్టెన్ గా వ్యవహరించకుండానే ఈ ఘనతను సాధించాడు. కోహ్లీ విశ్రాంతి తీసుకున్నప్పుడు రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించాడు. 2018లో ఆసియాకప్ టోర్నీకి కూడా కెప్టెన్ గా వ్యవహరించాడు.