Andhra Pradesh: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం.. కమిటీల ఏర్పాటు

new districts form procedure in ap

  • 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించే ప్రక్రియ
  • కమిటీకి సబ్‌ కమిటీలతో పాటు జిల్లాల కమిటీల ఏర్పాటు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • బాధ్యతలు అప్పగిస్తూ సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. ఏపీలో జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీకి సబ్‌ కమిటీలతో పాటు జిల్లాల కమిటీలను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాల సరిహద్దుల నియంత్రణ, న్యాయ వ్యవహారాల అధ్యయనం బాధ్యతను ఓ కమిటీకి, సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలను మరో కమిటీకి అప్పగించారు.

అలాగే, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనం బాధ్యతలు మూడో కమిటీకి, సాంకేతిక సంబంధిత అధ్యయన బాధ్యతలను నాలుగో కమిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్‌ కమిటీలకు అవసరమైన సాయం చేయడం కోసం కలెక్టర్‌ ఛైర్మన్‌గా పది మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.  

  • Loading...

More Telugu News