Sachin Tendulkar: నా తొలికారు ఎక్కడుందో ఎవరైనా చెబుతారా..?: సచిన్ విజ్ఞప్తి

Sachin Tendulkar wants his first car back

  • తొలినాళ్లలో మారుతి 800 కారు ఉపయోగించిన సచిన్
  • ఇప్పుడా కారు తనవద్ద లేదన్న సచిన్
  • తొలికారు ఎంతో ప్రత్యేకమైందని వెల్లడి

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తొలినాళ్లలో మారుతి 800 కారును ఉపయోగించేవాడు. అయితే ఇప్పుడా కారు తనవద్ద లేదని, ఆ కారును వెతికి పెట్టాలంటూ సచిన్ తన ఫ్యాన్స్ ను కోరాడు. ఆ కారు ప్రస్తుత యజమాని వివరాలు తనకు పంపితే, ఆ కారును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తానని సచిన్ తెలిపాడు.

తనకు కార్లంటే ఎంతో మోజు అని, చిన్నప్పుడు తన అన్నయ్యతో కలిసి రోడ్డుపై వెళ్లే కార్లను చూస్తూ ఉండేవాడ్నని ఈ బ్యాటింగ్ మ్యాస్ట్రో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కార్లంటే ఉన్న ఇష్టంతో ఎన్నో మోడళ్లు కొన్నానని, కానీ తొలికారు ఎంతో ప్రత్యేకమైనదని వివరించాడు. ఇప్పుడా కారు తనవద్ద లేకపోవడంతో ఎంతో వెలితిగా ఉందని పేర్కొన్నాడు.

Sachin Tendulkar
Maruti 800
First Car
Fans
Cricket
Team India
  • Loading...

More Telugu News