: అంపైర్ ను బెదిరించినందుకు దినేష్ కార్తిక్ కు జరిమానా


అంపైర్ ను బ్యాట్ తో బెదిరించినందుకుగాను ముంబై ఇండియన్స్ క్రికెటర్ దినేష్ కార్తిక్ తన మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా చెల్లించాలంటూ ఐపిఎల్ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మ్యాచ్ జరిగిన సంగతి విదితమే. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సమయంలో 11వ ఓవర్లో కార్తిక్ ఎల్బీడబ్ల్యుగా అంపైర్ ప్రకటించారు. దీంతో కార్తిక్ ఆగ్రహంతో అంపైర్ కు బ్యాట్ చూపించాడు. దీనిని పరిశీలించిన ఐపిఎల్ కమిటీ అతడికి జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News