Ileana: హర్షద్ మెహతా కథతో 'ది బిగ్ బుల్'.. ఇలియానా ఫస్ట్ లుక్ విడుదల!

Ileanas first look from The Big Bull released
  • ఒకప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఇలియానా
  • ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమ.. బ్రేకప్
  • 'ది బిగ్ బుల్'లో అభిషేక్ బచ్చన్ తో జోడీ 
  • త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్      
'దేవదాసు' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై, అనతికాలంలోనే ఇక్కడ నెంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన గోవా బ్యూటీ ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ఆ సమయంలోనే ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ ప్రేమలో పడి.. కొన్నాళ్లు అందులో నిండా మునిగి.. ఇటీవల అతని నుంచి బ్రేకప్ అయిన ఇలియానా ఇప్పుడు కెరీర్ మీద మళ్లీ దృష్టి పెట్టింది.

ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే, దక్షిణాదిన ఆఫర్లు లేకపోయినా హిందీలో ఒకటీ అరా చేస్తోంది. ఈ క్రమంలో చేస్తున్న చిత్రమే 'ది బిగ్ బుల్'. మూడు దశాబ్దాల క్రితం ఆర్ధిక నేరాలకు పాల్పడి.. స్టాక్ మార్కెట్ ను ఓ కుదుపు కుదిపేసిన స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి కూకీ గులాటి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో అభిషేక్ బచ్చన్ సరసన ఇలియానా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలోని ఇలియానా ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో కాకుండా డైరెక్టుగా డిస్నీ హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి ఈ చిత్రం ఇల్లీ బ్యూటీకి బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలను తెస్తుందేమో చూద్దాం.
Ileana
Abhishek Bachan
Harshad Mehata
Stock Market

More Telugu News