: సంగీత సాధనతో మేథోవికాసం!


శిశుర్వేత్తి... పశుర్వేత్తి... వేత్తి గానరసం ఫణి....అన్నారు పెద్దలు. అంటే శిశువులు, పశువులే కాకుండా పాములు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయట. సంగీతంలో వున్న మహిమను గురించి చెప్పడానికి మన వాళ్ళు  ఈ మాట చెబుతుంటారు. అయితే, సంగీతానికి సంబంధించి ఇప్పుడు శాస్త్రజ్ఞులు మరో కొత్త విషయాన్ని కనిపెట్టారు. అదేమిటంటే... చిన్నప్పుడే సంగీత సాధన మొదలు పెట్టిన వారిలో మేథస్సు ఎంతగానో వికసిస్తోందట!

ముఖ్యంగా ఏడేళ్ళ లోపులో సంగీత సాధన మొదలు పెట్టిన పిల్లల్లో ఈ మార్పును శాస్త్రజ్ఞులు పసిగట్టారు. అంటే, ఎంత త్వరగా సంగీత శిక్షణ తీసుకుంటే... అంత అద్భుతంగా వారి మెదడు ఎదుగుతుందని టొరంటో, కాంకార్డియా విశ్వ విద్యాలయం పరిశోధకులు పేర్కొంటున్నారు. బాల సంగీత కారులను, ప్రముఖ సంగీత కళాకారులను ఎంచుకుని, వారి మెదళ్లను స్కానింగ్ చేసి, పరిశోధనలు చేయడంతో ఈ విషయం బయటపడిందట.        

  • Loading...

More Telugu News