Rakul Preet Singh: వైష్ణవ్ తేజ్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్!

Rakul Preeth Sing to romance with Vaishnav Tej
  • వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం ప్రారంభం 
  • దర్శకత్వం వహిస్తున్న క్రిష్  
  • రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ 
నిన్నటివరకు స్టార్ హీరోల సరసన పలు చిత్రాలలో నటించిన అగ్రశ్రేణి కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కి జోడీగా ఓ చిత్రంలో నటిస్తోంది. చిరంజీవి మేనల్లుడు, హీరో సాయితేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ తొలిచిత్రం 'ఉప్పెన'. అది ఇంకా విడుదల కాకుండానే మరో సినిమాలో నటించడానికి అతనికి అవకాశం వచ్చింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కథానాయికగా రకుల్ ని ఎంచుకున్నారు.

మరోపక్క, పవన్ కల్యాణ్ తో తాను చేస్తున్న భారీ చిత్రానికి బ్రేక్ రావడంతో, ఈ గ్యాప్ లో వైష్ణవ్ తేజ్ తో ఓ చిన్న సినిమా చేయాలని క్రిష్ ప్లాన్ చేశాడు. ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహించి, సింగిల్ షెడ్యూల్ లో దీనిని పూర్తిచేయాలని క్రిష్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నిర్మాణ కార్యక్రమాలను ప్లాన్ చేసుకున్నారు.
Rakul Preet Singh
Krish
VaishnavT ej
Uppena

More Telugu News