: మంత్రి పార్థసారధి అఫిడవిట్ కేసు విచారణ జూన్ 14 న
మాధ్యమిక విద్యాశాఖా మంత్రి పార్థసారధి ఎన్నికల అఫిడవిట్ కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు కోర్టులో జూన్ 14 వ తేదీన జరుగనుంది. 2009 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేస్తూ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో తనపై ఉన్న ఫెరా కేసు విషయాన్ని ప్రస్తావించలేదని మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ కు ఫిర్యాదు చేసారు. అనంతరం విచారణ చేసిన కమీషనర్ మంత్రి భోగస్ అఫిడవిట్ దాఖలు చేసినట్టు నిర్ధారించారు. దీనిపై విచారణ జూన్ 14 కి వాయిదా పడింది.