Pranab Mukherjee: రక్త ప్రసరణ విషయంలో నా తండ్రి ఆరోగ్యం స్థిరం: ప్రణబ్ ముఖర్జీ కుమారుడు

Abhijit Says His Father Homoginically Stable

  • 84 ఏళ్ల వయసులో ప్రణబ్ కు బ్రెయిన్ సర్జరీ
  • హోమోడైనమికల్లీ స్టేబుల్ గా ఉన్నారు
  • ట్విట్టర్ లో అభిజిత్ ముఖర్జీ

శరీరంలో రక్త ప్రసరణ విషయంలో మాత్రమే తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 84 ఏళ్ల వయసులో కరోనా సోకడంతో పాటు బ్రెయిన్ సర్జరీ జరుగగా, ప్రణబ్ ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుండగా, ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న సంగతి తెలిసిందే.

"మీ అందరి ప్రార్థనలతో నా తండ్రి హీమోడైనమికల్లీ స్టేబుల్ గా ఉన్నారు. మీరంతా మీ ప్రార్థనలను కొనసాగించి, ఆయన వేగంగా కోలుకోవాలని కోరుకుంటారని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు" అని అభిజిత్ ట్వీట్ చేశారు.

Pranab Mukherjee
Abhijit
Brain Surgery
Hospital
  • Loading...

More Telugu News