Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Samantha plays her dream role after a long time
  • ఇన్నాళ్లకు డ్రీమ్ రోల్ పోషిస్తోన్న సమంత 
  • రాజశేఖర్ చిత్రానికి 20 కోట్ల బడ్జెట్టు!
  • త్రివిక్రమ్ చేతిలోకి వెళ్లిన రీమేక్ కథ  
*  తన డ్రీమ్ రోల్ లో నటించే అవకాశం ఇప్పటికి లభించిందని అంటోంది కథానాయిక సమంత. ప్రస్తుతం తాను 'ఫ్యామిలీ మేన్' వెబ్ సీరీస్ రెండో సీజన్ లో నెగటివ్ టచ్ వున్న పాత్రను పోషిస్తోంది. దీని గురించే చెబుతూ, 'ఇలాంటి పాత్ర పోషించాలని కలలు కన్నాను. ఇన్నాళ్లకు అది సాకారమైంది. మంచి కిక్కిచ్చే పాత్ర ఇది' అని చెప్పింది.
*  జాతీయ అవార్డు విజేత నీలకంఠ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి సీనియర్ హీరో రాజశేఖర్ రెడీ అవుతున్నారు. దీనిని 20 కోట్ల బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. సి.కల్యాణ్ తో కలసి జీవిత రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
*  మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుం కోషియం' చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఉద్దేశంతో సితార ఎంటర్ టైన్మెంట్స్ అధినేత నాగవంశీ హక్కుల్ని తీసుకున్నారు. బాలకృష్ణ, రానాలతో దీనిని నిర్మిస్తారని వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి మార్పులు చేర్పులు చేసి, మాటలు రాసి ఇమ్మని  ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని నిర్మాత రిక్వెస్ట్ చేశాడట. ఒకవేళ త్రివిక్రమ్ అంగీకరిస్తే కనుక ప్రాజక్టుకి మరింత క్రేజ్ వస్తుంది.  
Samantha
Rajashekhar
Balakrishna
Rana Daggubati

More Telugu News