Sanjay dutt: బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు స్టేజ్-4 ఊపిరితిత్తుల కేన్సర్

Sanjay Dutt diagnosed with stage 4 lung cancer
  • శ్వాసకోశ సమస్యలతో శనివారం ఆసుపత్రిలో చేరిన సంజయ్ దత్
  • ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన ద్రవాలు
  • అందరి ప్రేమాభిమానాలతో త్వరలోనే కోలుకుంటానన్న నటుడు
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్‌కు స్టేజ్- 4 ఊపిరితిత్తుల కేన్సర్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ముంబైలోని లీలావతి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో సంజయ్ దత్ శనివారం ఆసుపత్రిలో చేరగా, పరిస్థితి మెరుగుపడడంతో సోమవారం డిశ్చార్జ్ అయ్యాడు.

సంజయ్ దత్ ఆసుపత్రిలో చేరినప్పుడు అతడిలో ఆక్సిజన్ స్థాయులు 90-92 మధ్య ఉన్నాయి. దీంతో వెంటనే ఆయనకు కొవిడ్ పరీక్ష నిర్వహించారు. అయితే, వైరస్ సోకినట్టు నిర్ధారణ కాలేదు. దీంతో చాతీ భాగంలో పరీక్షలు నిర్వహించగా ద్రవాలు నిండిపోయినట్టు గుర్తించారు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో అతడు స్టేజ్-4 ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది.

సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంజయ్ దత్ మంగళవారం మాట్లాడుతూ.. వైద్య చికిత్స నిమిత్తం పనికి కొంత విశ్రాంతి ఇస్తున్నట్టు పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు మద్దతుగా ఉన్నారని, పుకార్లను నమ్మవద్దని కోరాడు. మీ ప్రేమాభిమానాలతో త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, సంజయ్ దత్ మరింత మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లనున్నట్టు సమాచారం.
Sanjay dutt
stage 4 lung cancer
Bollywood
Mumbai

More Telugu News