KTR: హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన మరో ఫ్లైఓవర్.. ప్రారంభించిన కేటీఆర్

 another flyover in Hyderabad

  • బైరామల్ గూడ చౌరస్తా నుంచి కుడివైపు పైవంతెన ప్రారంభం
  • 26.45 కోట్ల వ్య‌యంతో ప్రీ కాస్ట్‌ విధానంలో నిర్మాణం
  • బైరామ‌ల్ గూడ‌, సాగ‌ర్‌రోడ్ మధ్య తొలగనున్న ట్రాఫిక్ కష్టాలు
  • ఎల్బీనగర్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ వైపు వెళ్లే మార్గంలో నిర్మాణం

హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవ‌ర్  నేటి నుంచి నగర వాసులకు అందుబాటులోకి వచ్చింది. బైరామల్ గూడ చౌరస్తా నుంచి కుడివైపు పైవంతెనను ఈ రోజు ఉదయం తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ ఫ్లైఓవర్ ను 26.45 కోట్ల వ్య‌యంతో ప్రీ కాస్ట్‌ విధానంలో నిర్మించారు.

దేశంలోనే మొద‌టి సారి ఈ ప్ర‌త్యేక టెక్నాల‌జీని వినియోగించామ‌ని అధికారులు చెప్పారు. ఈ ఫ్లైఓవ‌ర్ నిర్మాణంతో బైరామ‌ల్ గూడ‌, సాగ‌ర్‌రోడ్ చౌరస్తాల మధ్య వాహనాల రాకపోకలు ఇక అంతరాయం లేకుండా కొనసాగుతాయి. ఎల్బీనగర్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ వైపు వెళ్లే మార్గంలో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. మొత్తం 14 పిల్లర్స్‌తో, 11 మీటర్ల వెడల్పుతో 780 మీటర్ల దూరం నిర్మించారు.
                                
ఈ రోజు ప్రారంభమైన కుడివైపు పైవంతెన ద్వారా ఎల్బీనగర్‌ వైపు నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా వాహనాలు వెళ్లే అవకాశం ఉంటుంది. దీని నిర్మాణం కోసం ఎల్బీనగర్‌ నుంచి బైరామల్‌ గూడ దారిలో 11 భవనాలను తొలగించారు. హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లైఓవర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.
            

  • Loading...

More Telugu News