India: కరోనా విజృంభణ వేళ నేపాల్‌కు భారత్ సాయం
- 10 వెంటిలేటర్లను నేపాల్‌కు అందజేత
- అందించిన భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా
- స్వీకరించిన నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ పూర్ణ చంద్ర థా
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నేపాల్‌కు భారత్ సాయం చేసింది. కరోనా చికిత్స తీసుకుంటోన్న రోగులకు విషమపరిస్థితుల్లో వాడే వెంటిలేటర్లను నేపాల్‌కు అందించింది. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ పూర్ణ చంద్ర థాపాకు ఈ రోజు ఉదయం నేపాల్‌లో ఆర్మీ ప్రధాన కార్యాలయంలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఈ వెంటిలేటర్లను అందించారు. నేపాల్‌కు మొత్తం పది వెంటిలేటర్లను భారత్ ఇచ్చింది.
కాగా, నేపాల్ ప్రధాని ఓలి శర్మ భారత్‌కు వ్యతిరేకంగా చేస్తోన్న వ్యాఖ్యలు చర్చనీయాశంమైన విషయం తెలిసిందే. అయినప్పటికీ, భారత్ 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన వెంటిలేటర్లను నేపాల్‌కు పంపింది.