Rohit Reddy: మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

TRS MLA Rohit Reddy Tested Corona Positive

  • వైరస్ బారిన పడుతున్న నేతలు
  • తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి వ్యాధి
  • చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలింపు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ, పలువురు నేతలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. నిన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్ సోకగా, ఆపై తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మహమ్మారి బారిన పడ్డారు. ఆయనకు వైరస్ సోకగానే, హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. కాగా, కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 10 రోజుల క్రితం ఆయనకు వైరస్ సోకగా, నిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు.

Rohit Reddy
Tandoor
Telangana
TRS
Corona Virus
  • Loading...

More Telugu News