Rayalaseema Lift Irrigation Project: రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరంలేదు: ఎన్జీటీ నిపుణుల కమిటీ నివేదిక
- రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ కమిటీ నివేదిక
- కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ అనుమతులు తప్పనిసరన్న కమిటీ
- కొత్త డీపీఆర్ సమర్పించాలని సూచన
నేషనల్ గ్రీన్ టైబ్యునల్ (ఎన్జీటీ) నిపుణుల కమిటీ నివేదికలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కీలక అంశాలు పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరంలేదని నివేదికలో తెలిపారు. అయితే, కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ అనుమతులు మాత్రం తప్పనిసరి అని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. అంతవరకు ప్రాజెక్టు పనులు చేపట్టరాదని ఎన్జీటీ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు, ప్రాజెక్టుకు సంబంధించి కొత్త డీపీఆర్ సమర్పించాలని సూచించారు. కాగా, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఈ నెల 11న ఎన్జీటీలో మళ్లీ విచారణ జరగనుంది.