Nandi Yellaiah: ఓటమి ఎరుగని నేత.. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి

Congress MP Nandi Yellaiah dies with Corona Virus

  • నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఆరు సార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం 
  • టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఎల్లయ్య

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి చెందారు. హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెల 29వ తేదీన కరోనా లక్షణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. నంది ఎల్లయ్య వయసు 78 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.

ఆరు సార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఓటమి ఎరుగని నేతగా నంది ఎల్లయ్యకు గుర్తింపు ఉంది. సిద్దిపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన 6వ, 7వ, 9వ, 10వ, 11వ లోక్ సభకు ఎన్నికయ్యారు. 16వ లోక్ సభకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2014లో తెలంగాణ శాసనమండలికి ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News