Lebanon: ఆ దృశ్యాలు భయానకంగా ఉన్నాయి: మహేశ్ బాబు

Actor Mahesh Babus response on Lebanon blasts

  • పేలుళ్లతో వణికిపోయిన లెబనాన్ రాజధాని బీరుట్
  • దాదాపు 73 మంది వరకు మృతి
  • దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మహేశ్ బాబు

లెబనాన్ రాజధాని బీరుట్ లో పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అధికారులు వెల్లడించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, 73 మంది వరకూ మరణించగా, సుమారు 3,700 మందికి గాయాలు అయ్యాయి. వందలాది భవనాలు ధ్వంసం అయ్యాయని, పేలుడు శబ్దాలతో తీవ్ర ఆందోళనకు గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వేలాది మంది తమవారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కాగా పేలుడు శబ్దాలు బీరుట్ కు 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ దీవుల వరకూ వినిపించడం గమనార్హం.  

మరోవైపు ఈ పేలుళ్లపై సినీ నటుడు మహేశ్ బాబు స్పందించాడు. జరిగిన ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. బీరుట్ పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని మహేశ్ అన్నాడు. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నానని చెప్పాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు.

Lebanon
Blasts
Mahesh Babu
Tollywood
  • Loading...

More Telugu News